Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Nee Nagumomu
P. Susheela
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
ఈ సూత్రముతో ఈ కుంకుమతో నను కడతేరి పోనిండు
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
ఉపచారాలే చేసితినో ఎరగక అపచరాలే చేసితినో
ఉపచారాలే చేసితినో ఎరగక అపచరాలే చేసితినో
ఒడుదుడుకులలో తోడై ఉంటిని మీ అడుగున అడుగై నడిచితిని
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు రెక్కలు అలిసి మీరున్నారు
రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు రెక్కలు అలిసి మీరున్నారు
పండుటాకులము మిగిలితిమి
పండుటాకులము మిగిలితిమి ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
ఏ నోములు నే నోచితినో ఈ దేవుని పతిగా పొందితిని
ఏ నోములు నే నోచితినో ఈ దేవుని పతిగా పొందితిని
ప్రతి జన్మ మీ సన్నిధిలోనా ప్రమిదగ వెలిగే వరమడిగితిని
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
ఈ సూత్రముతో ఈ కుంకుమతో నను కడతేరి పోనిండు
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ