Vadina Poole - Duet
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
వాడిన పూలే వికసించెనే
వాడిన పూలే వికసించెనే చెర వీడిన హృదయాలు పులకించెనే ఏఏ
వాడిన పూలే వికసించెనే
తీయని కలలే ఫలియించెనే
తీయని కలలే ఫలియించెనే యెల కొయిల తన గొంతు సవరించెనే ఏఏ
తీయని కలలే ఫలియించెనే
వేయిరేకులు విరిసింది జలజం
తీయ తేనియ కొసరింది భ్రమరం
లోకమే ఒక వుద్యానవనము లోటు లేదిక మనదే సుఖము
తీయని కలలే ఫలియించెనే యెల కొయిల తన గొంతు సవరించెనే ఏఏ
తీయని కలలే ఫలియించెనే
పగలే జాబిలి ఉదయించెనేలా
వగలే చాలును పరిహాసమేలా
పగలే జాబిలి ఉదయించెనేలా
వగలే చాలును పరిహాసమేలా
తేట నీటను నీ నవ్వు మొగమే తేలియాడెను నెలరేని వలెనే
వాడిన పూలే వికసించెనే చెర వీడిన హృదయాలు పులకించెనే ఏఏ
వాడిన పూలే వికసించెనే
జీవితాలకు నేడే వసంతం
చేదిరిపోవని ప్రేమానుబంధం
ఆలపించిన ఆనంద గీతం ఆలకించగ మధురం మధురం
వాడిన పూలే వికసించెనే చెర వీడిన హృదయాలు పులకించెనే ఏఏ
వాడిన పూలే వికసించెనే