Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ee Udayam Naa Hrudayam
Ghantasala
Popularity · Very high
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఈ ఉదయం నా హృదయం
పురులు విరిసి ఆడింది
పులకరించి పాడింది
పురులు విరిసి ఆడింది
పులకరించి పాడింది
ఈ ఉదయం
పడుచు పిల్ల పై ఎదలా
పలుచని వెలుగు పరచినది
పడుచు పిల్ల పై ఎదలా
పలుచని వెలుగు పరచినది
కొండల కోనల మలుపుల్లో
కొత్త వంపులు చూపినది
ఈ ఉదయం
చిగురాకులతో చిరు గాలి
సరసాలాడి వచ్చినది
చక్కలిగింతలు పెట్టినది
వేసవికే చలి వేసినది
ఓ ఓ ఓహో ఓ ఓ ఓహో
ఈ ఉదయం
సరస్సున జలకాలాడేదెవరో
తేటిని వెంట తిప్పేదెవరో
సరస్సున జలకాలాడేదెవరో
తేటిని వెంట తిప్పేదెవరో
రేయికి సింగారించే కలువో
పగలే వగలు రగిలే కమలమో
ఈ ఉదయం నా హృదయం
పురులు విరిసి ఆడింది
పులకరించి పాడింది
పురులు విరిసి ఆడింది
పులకరించి పాడింది