Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Telugu Padaniki
S.P. Balasubrahmanyam, Sujatha & Renuka
Popularity · Low
+
Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
తెలుగు పదానికి జన్మదినం
ఇది జానపదానికి ఙానపదం
ఏడు స్వరాలే ఏడుకొండలై
వెలసిన కలియుగ విష్ణుపదం
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
అరిషడ్వర్గము తెగనరికే
హరి ఖడ్గమ్మిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మా భారతి
నాదాశీస్సులు పొందినది
శివలోకమ్మున చిద్విలాసమున
ఢమరుధ్వనిలో గమకితమై
దివ్యసభలలో భవ్యలాస్యముల పూబంతుల
చేబంతిగ ఎగసి
నీరద మండల నారద తుంబుర
మహతీ గానపు మహిమలు తెలిసి
శితహిమకందర యతిరాట్సభలో
తపః ఫలమ్ముగ తళుకుమని
తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ
గర్భాలయమ్ములో ప్రవేశించే ఆ నందకము
నందనానందకారకము
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
పద్మావతియే పురుడుపోయగా
పద్మాసనుడే ఉసురుపోయగా
విష్ణుతేజమై నాదబీజమై
ఆంధ్రసాహితీ అమరకోశమై
అవతరించెను అన్నమయ
అసతోమా సద్గమయా
అవతరించెను అన్నమయ
అసతోమా సద్గమయా
పాపడుగా నట్టింట పాకుతూ
భాగవతము చేపట్టెనయా
హరినామమ్మును ఆలకించక
అరముద్దలనే ముట్టడయా
తెలుగు భారతికి వెలుగు భారతై
ఎదలయలో పదకవితలు కలయా
తాళ్ళపాకలో ఎదిగే అన్నమయ
తమసోమా జ్యోతిర్గమయా
తమసోమా జ్యోతిర్గమయా
తమసోమా జ్యోతిర్గమయా