Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Paravasame Paravasame (From "Narayana And Co")
Dr. Josyabhatla
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
పరవశమే పరవశమే
తెలియని ఓ పరవశమే
తెలిసెనిలా తొలి కలలా
చెలి చెలిమే అతిశయమే
సమ్మతమే సమ్మతమే
మనసుకిది సమ్మతమే
అడగకనే అడుగు అలా
తడబడుతూ నడవడమే
మౌనం చాటున్న తీపి మాటేదో
చెప్పాలంటూనే తికమక ఎందుకనో
అరె అరె ఇది నిజమా
ఇరు మనసుల పరిచయమా
అది ఇది కాదు సుమా
తొలి వలపుల సహజము ఈ మహిమా
నీకు నాకు దూరం కరిగే
నాతో నీకు చనువే పెరిగే
కాలాన్ని ఆపేసి కలలెన్నో చూద్దాం
కాసేపు ఆచోటే అలా ఆగుదాం
దారే తెలియక నీ జూక
జారే చేతిలో ఓ చిలక
దారే తెలియక నీ జూక
జారే చేతిలో ఓ చిలక
అడగకనే వరమై ఎద చేరావే
అరె అరె ఇది నిజమా
ఇరు మనసుల పరిచయమా
అది ఇది కాదు సుమా
తొలి వలపుల సహజము ఈ మహిమా
నువ్వు నేను చెరి సగమేగా
నాలో నువ్వే చేరిపోగా
నీ అడుగులో అడుగై
ఉంటాను కలకాలం
ఈ గురుతు గుండెల్లో
సదా పదిలం
పాదం పరుగే నీ వెనక
ప్రాణం నీతో కడదాకా
పాదం పరుగే నీ వెనక
ప్రాణం నీతో కడదాకా
సాగాలి అనుకోవడమే ప్రేమా
అరె అరె ఇది నిజమా
ఇరు మనసుల పరిచయమా
అది ఇది కాదు సుమా
తొలి వలపుల సహజము ఈ మహిమా