Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Olammo Gowrammo
S. P. Balasubrahmanyam; Swarnalatha
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఓలమ్మో గౌరంమో బలే జోరంమ్మో చుడమ్మో
(జంగమ శివ జంగమ శివ జంగమ శివుడే)
ఓరయ్యో జంగమ్మ గుండె నిండిపో గుంగుమ
(జంగమ శివ జంగమ శివ జంగమ శివుడే)
జనక జనక జనక జనక
లయల హొయలు సోలే దాక
కులుకు లొలుక మేలమాడి
పొద్దు పొడిచి పోయేదాకా
జాగరణ పండగే పండునమ్మో గౌరమ్మో
కోరికల కొలువై తీరునమ్మో కొండమ్మో
ఓలమ్మో గౌరంమో బలే జోరంమ్మో చుడమ్మో
(జంగమ శివ జంగమ శివ జంగమ శివుడే)
సత్యమూర్తి అమ్మో సల్లా సల్లని రేడు
సయ్యంటూ వచ్చేసిండు
యమకే దాసుడై పిల్లా మనసు దోచిండు
ఈశాన్య దిక్కుకాడ పుట్టిన
సలి గాలినంతా పాగోర్తీ పడక దిక్కుకే
శివ శివ అంటూ ఉరికించి
పట్టిన చెమటలు ఆర్చిండు
మహాశివ రాత్రిని జోడు తాళాలు కొట్టి
ఆరు నాట్య శాస్త్రాలను
ఒక్క గజ్జ కొసకు గట్టి
కొండాకోన దద్దరిల్లా ఆడుతాడే పాడుతాడే
(కొండాకోన దద్దరిల్లా ఆడుతాడే పాడుతాడే)
మదన కామరాజా తీరు కోరి కోరి కులుకుతాడే
(మదన కామరాజా తీరు కోరి కోరి కులుకుతాడే)
పిట్టకన్ను చెదిరేటట్టు లొట్టలేసి కూడుతాడే
(పిట్టకన్ను చెదిరేటట్టు లొట్టలేసి కూడుతాడే)
ఈడు ఆట వీడి లాగ ఇంకా ఎవడు ఆడలేడే
(ఈడు ఆట వీడి లాగ ఇంకా ఎవడు ఆడలేడే)
తోలుబొమ్మలాటలోనా వీడికేవాడు సాటిరాడే
ఓలమ్మో గౌరమ్మో బలే జోరంమ్మో చుడమ్మో
(జంగమ శివ జంగమ శివ జంగమ శివుడే)
ధీంతక్క జంగమ్మ గుండె నిండిపో డిండిమ
(జంగమ శివ జంగమ శివ జంగమ శివుడే)
ఏడేడు లోకాలను ఏలే దొర వీడేలే
పిసరంత బిల్వపత్రికే
లొంగునే పొంగునే తీరని మొక్కులు తీర్చునే
సతీమతి సిరిమతి అదిశక్తిని కలిసి
ఆనందమూర్తి సిందులే
వేసెలే వెచ్చని అంగన ముంగిట ముగ్గులే
ఎనక ముందు మాటలేక భక్తికి పొంగిపోయి
అసరులకు వరాలు ఇస్తాడు రెచ్చిపోయి
తుంబురునికి నారదునికి లాలపోసి లాగుతాడే
(తుంబురునికి నారదునికి లాలపోసి లాగుతాడే)
జీవితంతు నాదతంతు మీటుతాడే మిటుకుతాడే
(జీవితంతు నాదతంతు మీటుతాడే మిటుకుతాడే)
సందు చూసి సామలీల పాడుతాడే పలుకుతాడే
(సందు చూసి సామలీల పాడుతాడే పలుకుతాడే)
ప్రణయ విందు ప్రణవమంటూ సాటిచాళ్లు చిలుకుతాడే
(ప్రణయ విందు ప్రణవమంటూ సాటిచాళ్లు చిలుకుతాడే)
ఓనమాలు జీవాలే ఓంకారమంటాడే జంగమ్మ
ఓలమ్మో గౌరంమో బలే జోరంమో చుడమ్మో
జంగమ శివ జంగమ శివ జంగమ శివుడే
ఓరయ్యో జంగమ్మ గుండె నిండిపో గంగుమ
జంగమ శివ జంగమ శివ జంగమ శివుడే
హై జనక జనక జనక జనక
లయల హొయలు సోలే దాక
కులుకు లొలుక మేలమాడి
పొద్దు పొడిచి పోయేదాకా
జాగరణ పండగే పండునమ్మో గౌరమ్మో
కోరికల కొలువై తీరునమ్మో కొండమ్మో
ఓలమ్మో గౌరంమో బలే జోరంమ్మో చుడమ్మో
(జంగమ శివ జంగమ శివ జంగమ శివుడే)