Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kadhile Paadham
Shankar Mahadevan
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
కదిలే పాదమిది నదిలా సాగమనదా
పయనం ఆపకని పరుగే తీయమనదా
ఆ కలల వెనకే అడుగు కదిపే ఆరాటం
ఏ క్షణము నిజమై కుదుటపడునో ఆవేశం
ప్రతిరోజూ నీలో చిగురేసే ఆశే జతగా
నడిచేనా శ్వాసై నిను గమ్యం చేర్చే దిశగా
కదిలే పాదమిది నదిలా సాగమనదా
పయనం ఆపకని పరుగే తీయమనదా
చెరగదే జ్ఞాపకమేదైనా పసితనం దాటిన ప్రాయాన
సమరమే స్వాగతమిచ్చేనా
కలగనే ఆశయమేదైనా బతుకులో ఆశలు రేపేనా
ఇపుడిలా నీ దరి చేరేనా
ఎదను తాకే గాయలు తాగే నేస్తాలు నీలో
ఎదురుచూసే కాలాలు పూసే చైత్రాలు నీ దారిలో
కదిలే పాదమిది నదిలా సాగమనదా
పయనం ఆపకని పరుగే తీయమనదా
వెలుగయే వేకువలెన్నైనా వెతికితే లేవా నీలోన
జగతికే దారిని చూపేనా
గగనమే నీ తొలి మజిలీనా గమనమే ఓ క్షణమాగేనా
విజయమే నీడగ సాగేనా
అలలు రేపే సంద్రాలు దూకే సైన్యాలు నీలో
చెలిమి కోరే లోకాలు చేసే స్నేహాలు ఈ వేళలో
కదిలే పాదమిది నదిలా సాగమనదా
పయనం ఆపకని పరుగే తీయమనదా