Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Toli Pilupey
S.P. Balasubrahmanyam, K. S. Chithra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే
తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే
తొలిపిలుపే నిన్ను నన్ను కలగలిపే
తొలిపిలుపే నీలో నాలో కలలను కదిపే
తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే
తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే
ఒక చూపుతోటి ఒక చూపుకలిపి వెనుచూపు లేని జత పయనమిది
ఒక చేయిలోన ఒక చేయివేసి ఒకటయ్యే చెలిమిది
ఒక మాటతోటి ఒక మాట కలిపి మొగమాటమైన మగువాట ఇది
ఒక గుండెతోటి ఒక గుండెచేరి ఒదిగుండే కథ ఇది
ప్రతిపదమూ ప్రియా అని వలచినది
ప్రతిఫలమూ ఆశించని మమతల వ్రతమిది
తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే
తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే
మనసైన వేళ కనుసైగ చాలు పలు దేశభాషలిక దేనికిలే
అధరాల పాల చిరుధార చాలు ఆహారం దేనికే
ఎదురైన వేళ కౌగిళ్ళు చాలు ఏ ఇల్లివాకిలిక ఎందుకులే
మన చుంబనాల సవ్వళ్ళు చాలు సంగీతం ఎందుకే
ఇరువురికీ ఏడో రుచి తెలిసినదీ
మనుగడకీ మరోముడై ముడి పడు ముడుపిది
తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే
తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే
తొలిపిలుపే నిన్ను నన్ను కలగలిపే
తొలిపిలుపే నీలో నాలో నిదురను చిదిపే
తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే
తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే