Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Vidhatha Talapuna
S P Balasubramaniam, P Susheela
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
విధాత తలపున ప్రభవించినది
అనాది జీవన వేదం ఓం
ప్రాణనాడులకు స్పందననొసగిన
ఆది ప్రణవనాదం ఓం
కనుల కొలనులో ప్రతిబింబించిన
విశ్వరూప విన్యాసమ్
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన
విరించి విపంచి గానం ఆ
సరసస్వర సురఝరీగమనమౌ
సామవేద సారమిది
సరసస్వర సురఝారీగమనమౌ
సామవేద సారమిది
నేపాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనమ్
విపంచినై వినిపించితిని ఈ గీతమ్
ప్రార్దిష వీణియ పైన
దినకర మయూహ తంత్రులపైన
జాగృత విహంగ తతులే
వినీల గగనపు వేదిక పైన
ప్రార్దిష వీణియ పైన
దినకర మయూహ తంత్రులపైన
జాగృత విహంగ తతులే
వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల త్వనముల స్వరగతి
జగతికి శ్రీకారము కాగా
విశ్వకావ్యమునకిది భాష్యముగా
విరించినై విరచించితిని ఈ కవనమ్
విపంచినై వినిపించితిని ఈ గీతమ్
జనించు ప్రతి శిశు గళమున పలికిన
జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు
హృదయ మృదంగధ్వానం
జనించు ప్రతిశిశు గళమున పలికిన
జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు
హృదయ మృదంగధ్వానం
అనాది రాగం ఆది తాళమున
అనంత జీవన వాహిని గా
సాగిన సృష్టి విలాసమునే
విరించినై విరచించితిని ఈ కవనమ్
విపంచినై వినిపించితిని ఈ గీతమ్
నా ఉచ్వాసం కవనం నా నిశ్వాసం గానం
నా ఉచ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సరసస్వర సురఝరీగమనమౌ
సామవేద సారమిది
నేపాడిన జీవన గీతం ఈ గీతం