Skip to content

Halo Halo Ammayi

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

హలో హలో ఓ అమ్మాయి పాతరోజులు మారాయి ఆడపిల్ల అలిగినచో వేడుకొనడు అబ్బాయి ఒహో బడాయి చాలోయి కూతలెందుకు పోవోయి ఆది నుంచి లోకంలో ఆడవారిది పైచేయి నిజా నిజాలు తెలియకనే నిందవేసే పొరబాటు నిజా నిజాలు తెలియకనే నిందవేసే పొరబాటు నాటికి నేటికీ మీకు అలవాటే హలో హలో ఓ అమ్మాయి ఔను మీదే పైచేయి బెట్టుచేసే మగవారి గుట్టు మాకూ తెలుసోయి బెట్టుచేసే మగవారి గుట్టు మాకూ తెలుసోయి మనసులో మమతలూ పైకి వేషాలూ ఒహో బడాయి చాలోయి కూతలెందుకు పోవోయి లడాయి చేసే స్త్రీజాతి రాకమానదు రాజీకి లడాయి చేసే స్త్రీజాతి రాకమానదు రాజీకి గెలుపు కోసం మగవారు గెలుపు కోసం మగవారు కాళ్ళబేరాలాడకపోరు ఒహో బడాయి చాలోయి కూతలెందుకు పోవోయి ఆది నుంచి లోకంలో ఆడవారిది పైచేయి హలో హలో ఓ అమ్మాయి పాతరోజులు మారాయి ఆడపిల్ల అలిగినచో వేడుకొనడు అబ్బాయి హలో హలో ఓ అమ్మాయి అందుకొనుమా నా గుడ్ బై సాహిత్యం: ఆరుద్ర: ఘంటసాల, పి.సుశీల: ఆదుర్తి సుబ్బారావు