Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Evarannarivi Kannulani
P. Susheela
,
Ghantasala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఎవరన్నారివి కన్నులని
ఎవరన్నారివి కన్నులని అరెరె మధువొలొకే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని
ఎవరన్నారివి బుగ్గలని హోయ్ ఎర్రని రోజా మొగ్గలవి
ఎవరన్నారివి కన్నులని
నడుమిది ఏమంటున్నది ఈ నడుమిది ఏమంటున్నది
నా పిడికిట ఇమడెదనన్నది
నల్లని జడ ఏమన్నది నా నల్లని జడ ఏమన్నది
అది నను బంధించెద నన్నది
నను బంధించెదనన్నది
ఎవరన్నారివి కన్నులని అరెరె మధువొలొకే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని హోయ్ ఎర్రని రోజా మొగ్గలవి
సిగ్గులు దోసిట దూయకు నా సిగ్గులు దోసిటదూయకు
నీ చేతుల బందీ చేయకు
నీ చేతుల బందీ చేయకు
మెల్లగ లోలో నవ్వకు మెలమెల్లగ లోలో నవ్వకు
చలచల్లగ పిడుగులు రువ్వకు
చల్లగ పిడుగులు రువ్వకు
ఎవరన్నారివి కన్నులని అరెరె మధువొలొకే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని హోయ్ ఎర్రని రోజా మొగ్గలవి
అడుగున అడుగిడుటెందుకు నా అడుగున అడుగిడుటెందుకు
నువు తడబడి పోతున్నందుకు
మరి మరి చూచెదవెందుకు
నను మరి మరి చూచెదవెందుకు
నువు మైకం లో ఉన్నందుకు
మైకంలో ఉన్నందుకు
ఎవరన్నారివి కన్నులని అరెరె మధువొలొకే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని హోయ్ ఎర్రని రోజా మొగ్గలవి
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి