Skip to content

Okkasari Cheppaleva

Koti, Kumar Sanu, K. S. Chithra
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ... చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి ఓ... నిదుర పొయే మదిని గిల్లి ఎందుకా అల్లరి చందమామ మనకందదని ముందుగానే అది తెలుసుకుని చేయి చాచి పిలవద్దు అని చంటిపాపలకి చె బుతామా లేని పోని కలలెందుకని మేలుకుంటే అవి రావు అని జన్మలోనె నిదరోకు అని కంటిపాపలకి చెబుతామా కలలన్నవి గలలని నమ్మనని అవి కలవని పిలవకు కలవమని మది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ... చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరిజల్లులతో చుక్కలన్ని దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా అంతులేని తన అల్లరితో అలుపు లేని తన అలజడితో కెరటమెగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగి పడుతుందా మనసుంటే మార్గం ఉంది కదా అనుకుంటే అందనిదుంటుందా అనుకున్నవన్ని మనకందినట్టే అనుకుంటే తీరిపోదా ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ... చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ