Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Pellayyindi
S.P. Balasubrahmanyam, P. Susheela, K. V. Mahadevan
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది
పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది
వయసు ఉరికింది సొగసు బెదిరింది
పెదవి అదిరింది పంటానొక్కింది
పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది
వయసు ఉరికింది సొగసు బెదిరింది
పెదవి అదిరింది పంటానొక్కింది
పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది
కమ్మని కల వచ్చింది
ఆ కలకొక రూపొచ్చింది
కమ్మని కల వచ్చింది
ఆ కలకొక రూపొచ్చింది
జరిగినది గురుతొచ్చింది
ఇక జరిగేది ఎదురొచ్చింది
జరిగినది గురుతొచ్చింది
ఇక జరిగేది ఎదురొచ్చింది
కళ్ళకు జత కుదిరింది కతలెన్నో చెబుతుంది
పెదవి మీద రాసుంది చదివి చెప్పమన్నది
పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది
కుర్రతనం కొత్త రుచులు కోరింది
రుచి తెలిసిన కొంటెతనం గారంగా కొసరింది
కుర్రతనం కొత్త రుచులు కోరింది
రుచి తెలిసిన కొంటెతనం గారంగా కొసరింది
గడుసుతనం కొసరిస్తా అసలు ఇవ్వనన్నది
ప్రతి రోజు కొసరిస్తే
అసలు మించిపోతుంది
పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది
ఎప్పుడో నన్నిచ్చాను ఇంకిప్పుడేమి ఇస్తాను
ఇన్నాళ్ళు ఇవ్వనివి మిగిలి ఎన్నెన్నో ఉన్నవి
ఎప్పుడో నన్నిచ్చాను ఇంకిప్పుడేమి ఇస్తాను
ఇన్నాళ్ళు ఇవ్వనివి మిగిలి ఎన్నెన్నో ఉన్నవి
ఇపుడే తెలిసింది ఎప్పుడేప్పుడని ఉంది
మూడుముళ్ళు వేసినది ఏడడుగులు నడిచినది
అందుకే ఆ విందుకే
పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది
వయసు ఉరికింది సొగసు బెదిరింది
పెదవి అదిరింది పంటానొక్కింది
పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది
ప్రేమవిందుకు వేళయింది
ప్రేమవిందుకు వేళయింది