Skip to content

Evvaru Emanna

R.P.Patnaik
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమ మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమ కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమ నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమ ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ (ACVL) కాలమొస్తే సిరిమల్లె తీగకి చిగురే పుడుతుంది ఈడు వస్తే ఈ పడుచు గుండెలో ప్రేమ పుడుతుంది గొడుగు అడ్డుపెట్టినంతనే వాన జల్లు ఆగిపోవునా గులకరాయి వేసినంతనే వరద జోరు ఆగిపోవునా ఏడు లోకాలు ఏకం అయినా ప్రేమను ఆపేనా ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ (ACVL) ప్రేమ అంటే ఆ దేవుడిచ్చిన చక్కని వరమంట ప్రేమ ఉంటే ఈ మనసుకెప్పుడూ అలుపే రాదంట కండలెంత పెంచుకొచ్చినా కొండనెత్తి దించలేరుగా కక్షతోటి కాలు దువ్వినా ప్రేమనెవ్వరాపలేరుగా ప్రేమకెపుడైనా జయమే కానీ ఓటమి లేదంట ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమ మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమ కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమ నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమ శాశ్వతమీ ప్రేమ...