Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kirathaar Juneeyamu
S.P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
తకితథక తకతకిత జకిత పదయుగళ
నికట గంగాస్తవిత మకుట తట నిగళా
హరిహరాంచిత కళా కలిత నీలగళా
సాంద్రఛ్చటాపటల నిటళ చంద్రకళా
జయజయ మహాదేవ శివశంకరా
హరహర మహాదేవ ఆభయంకరా
అని దేవతలు శివుని కొనియాడ
పరవశమ్మున శివుడు తాండవమ్మాడగా
కంపించెనింతలో కైలాసమావేళ
కనిపించెనంత అకాల ప్రళయ జ్వాలా
జగములేలిన వాని సగము నివ్వెరబోయే
సగము మిగిలిన వాని మొగము నగవైపోయే
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
అతడే అతడే అర్జునుడు ఓం నమః శివాయ
పాండవ వీర యశోధనుడు
అతడే అతడే అర్జునుడు. ఓం నమః శివాయ
పాండవ వీర యశోధనుడు
అనితరాసాధ్యము పాశుపతాస్త్రం
కోరి ఇంద్రగిరి చేరి శివునికై
అహోరాత్రములు చేసెను తపస్సు
ఇది సృష్టించెను దివ్య మహత్తు
నెలవంక తలపాగ నెమలి ఈకగ మారే
తలపైని గంగమ్మ తలపులోనికి బారే
నిప్పులుమిసే కన్ను నిదురోయి బొట్టాయే
భూతిపూతకు మారు పులితోలు వలువాయే
ఎరుక కలిగిన శివుడు ఎరుకగా మారగా
తల్లి పార్వతి మారే తాను ఎరుకతగా
ఓంకార ధనవుగా ఒదిగే త్రిశూలంమ్ము
కైలాసమును వీడి కదలి వచ్చెను శివుడు
కైలాసమును వీడి కదలి వచ్చెను శివుడు
శివుని ఆనతిని శిరమున దాల్చి
మూకాశురుడను రాక్షసుడు
వరాహ రూపము ధరించి వచ్చెను
ధరతలంబే అధిరిపోవగా
చిచ్చరపిడుగై వచ్చిన పందిని
రెచ్చిన కోపముతో అర్జునుడు
మట్టుబెట్టగా పట్టె బాణము
ధనువొక చేతను అందుకొని
చూసిన కంటను చూడకనే
గురి చూసినంతనే
వేసినంతనే తలలు రెండుగా
బిల బిలలాడుతూ తనువు కొండగా
గిర గిరతిరుగుతూ అటు ఇటు తగిలిన
రెండు బాణముల అశువులు వీడెను వరాహము
కొట్టితి నేననీ అర్జునుడు పడకొట్టితినేననీ శివుడు
పట్టిన పట్టును వదలకనే తొడకొట్టిన వీరముతో అపుడు
వేట నాది వేటు నాది వేటాడే చోటు నాది
వేటి తగవు పొమ్మని విను మీటి పలికె శివుడు
చేవ నాది చేతనాది చేటెరుగని ఈటె నాది
చేవుంటే రమ్మని కనుసైగ చేసె అర్జునుడు
గాంఢీవ పాండిత్య కళలుగా బాణాలు
కురిపించే అర్జునుడు కానీ
అపుడతను వేయి చేతుల కార్తవీర్యార్జునుడు
ఓంకార ఘన ధనుష్టంకారములతోడ
శరపరంపర కురిసే హరుడు
అయినా నరునికాతడు మనోహరుడు
చిత్రమేమో గురిపెట్టిన బాణమ్ములు మాయమాయే
విధివిలాశమేమో పెట్టిన గురి వట్టిదాయే
అస్త్రములే విఫలమాయే
శస్త్రములే వికలమాయే
సవ్యసాచి కుడియడమై సంధించుట మరచిపోయే
జగతికి సుగతిని సాధించిన తల
దిగంతాల కవతల వెలిగే తల
గంగకు నెలవై కళకాధరువై
హరి బ్రహ్మలకు తరగని పరువై
అతి పవిత్రమై అకలవిత్రమై
శ్రీకరమై శుభమైన శివుని తల
అదరగా సుదతి చెదరగా
కాడి ఎద్దు గాంఢీవముతో ముక్కాడి ఎద్దు గా
ఎదిగి అర్జునుడు చెండ కోపమున కొట్టినంతనే
తల్లిదండ్రుల చలువ తనువైన దేవుడు
కోరినవరాలిచ్చు కొండంత దేవుడు
ఎదుట నిలిచెను శివుడు ఎదలోని దేవుడు
పదములంటెను నరుడు భక్తి తో అపుడు
"కర చరణ కృతంవా కర్మ వాక్కాయజంవా
శ్రవణ నయనజంవా మానసంవాపరాధం
విహితమహితంవా సర్వామే తక్షమస్వ
శివ శివ కరుణాబ్దే శ్రీమహాదేవ శంభో
నమస్తే నమస్తే నమస్తే నమః