Matanate
K. S. Chitra & S. P. Balasubrahmanyam
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
మాటంటే మాటేనంట
కంటపడ్డ నిజమంతా... అంటా
రుజువంటూ దొరికిందంటే
గంట కొట్టి చాటేస్తూవుంటా
నిజమంటే తంటాలంటా
నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా
మొదలంటూ చెడతావంటా
వెంటబడి తెగ తంతారంట
గోపీ నా పక్కనుంటే భయమింకా ఎందుకంటా
ఎవరంటే నాకేవంటా తప్పులుంటె ఒప్పనంటా
నీవెంటే నేను ఉంటా చూస్తుంటా ఓరకంట
నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంటా
జనక్... జుమ్మా...
మాటంటే మాటేనంట
కంటపడ్డ నిజమంతా... అంటా
మొదలంటూ చెడతావంటా
వెంటబడి తెగ తంతారంట
నువ్వే మా మొదటి guestని
మా ఆవిడ వంట bestని
ఈ feastకి పిలుచుకొస్తిని taste చెప్పి పోరా
ఇదే మా విందు భోజనం
మీరే మా బంధువీ దినం
రుచుల్లో మంచి చెడ్డలు ఎంచి తెలుపుతారా
అపార్ధం చేసుకోరుగా...
అనర్ధం చెయ్యబోరుగా...
యదార్ధం చేదుగుంటది...
పదార్ధం చెత్తగున్నది...
ఇది విందా నా బొందా
తిన్నోళ్ళూ గోవిందా
జంకేది లేదింక నీ టెంక పీకెయ్యక పదరకుంకా
నిజమంటే తంటాలంటా
నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా
మొదలంటూ చెడతావంటా
వెంటబడి తెగ తంతారంట
గోపీ నా పక్కనుంటే భయమింకా ఎందుకంటా
ఎవరంటే నాకేవంటా తప్పులుంటె ఒప్పనంటా
నిజమంటే తంటాలంటా
నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా
రుజువంటూ దొరికిందంటే
గంట కొట్టి చాటేస్తూవుంటా
భళారే నీలి చిత్రమా...
భలేగా వుంది మిత్రమా...
ఇలా రస యాత్ర సాగదా పక్కనుంటె భామా
కోరావు అసలు ట్రూతును
చూపాను సిసలు బూతును
చిక్కారు తప్పు చేసి ఇక మక్కెలిరగదన్ను
తమాషా చూడబోతిరా...
తఢాఖా చూపమందురా...
మగాళ్ళని ఎగిరి పడితిరా...
మదించి మొదలు చెడితిరా...
సిగ్గైనా ఎగ్గైనా లేకుండా దొరికారా
లాకప్పు పైకప్పు మీ కిప్పుడే చూపుతా
బెండు తీస్తా...
మాటంటే మాటేనంట
కంటపడ్డ నిజమంతా... అంటా
రుజువంటూ దొరికిందంటే
గంట కొట్టి చాటేస్తూవుంటా
నీవెంటే నేను ఉంటా చూస్తుంటా ఓరకంట
నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంటా
జనక్... జుమ్మా...
మాటంటే మాటేనంట
కంటపడ్డ నిజమంతా... అంటా
మొదలంటూ చెడతావంటా
వెంటబడి తెగ తంతారంట
రచన: సిరివెన్నెల