Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Paravasame
Sachin Warrier feat. Divya S Menon
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
పరవశమే పరవశమే... ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే
పరవశమే పరవశమే... ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే
ఆహా అంటోంది నా సంబరం ఒడిలో వాలింది నీలంబరం
మనసే పసి పావురం
వలపే తన గోపురం
వెతికి కలిసెను నిన్నీ క్షణం
కధలో మలుపీ స్వరం
కలలో నిజమీ వరం
అలలై ఎగసెను కోలాహలం
పరవశమే పరవశమే.ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే
పరవశమే పరవశమే.ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే
నింగి... నీలం
ఆకు... పచ్చ
నువ్వు... నేను జంట వీడిపోము
పలుకు ...రాగం
మెరుపు... మేఘం
దేహం... ప్రాణం మనమై కలిసాము
జతగా ప్రతి జన్మకి నువ్వే చెలి జానకి
నీలో సగమే జీవించనీ
ఎదలో సహవాసమై
వ్యధలో వనవాసమై
నీతో నీడై పయనించనీ