Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Vennello
Sadhana Sargam, S.P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
వెన్నెల్లో వేసంకాలం
ఎండల్లో శీతాకాలం
నీ ఒళ్ళో సాయంకాలం హాయిలే హలా
కన్నుల్లో తొలి కార్తీకం
కౌగిట్లో కసి తాంబూలం
సరసంలో సంధ్యా రాగం సాగునే ఇలా
ఏకంగా ఏలే రాజ్యం
యదలోనే రాసే పద్యం
ఆశల్లో పోసే ఆజ్యం కాదులే కలా
లాలి లాలి లాహిరి ఇదేమి లాహిరి
లాలి ఎంత పాడినా ఇదేమి అల్లరి
పండని పదె పదె పెదాల కిన్నిరి
పండని పదె పదె పెదాల తిమ్మిరి
వెన్నెల్లో వేసంకాలం
ఎండల్లో శీతాకాలం
నీ ఒళ్ళో సాయంకాలం హాయిలే హలా
నీ తోడు లేనిదే నాకు తోచదు
నీ నీడ కానిదే ఊపిరాడదు
నీ తోడు లేనిదే నాకు తోచదు
నీ నీడ కానిదే ఊపిరాడదు
కోకిలమ్మ పాడింది కొమ్మకొక్క సన్నాయి
కొంగు ముడ్లు కోరింది కొక చాటు అమ్మాయి
చెలి చూపు రాసే తొలి ప్రేమ లేఖ
పొలిమేర దాటి చలి ఆగలేక
విరజాజి పూల వాసనే వంతెనేయగా
వెన్నెల్లో వేసంకాలం
ఎండల్లో శీతాకాలం
నీ ఒళ్ళో సాయంకాలం హాయిలే హలా
జాజిపూల గాలితో జాబులంపినా
జాబిలమ్మ గిల్లుడే ఆగనంటది
జాజిపూల గాలితో జాబులంపినా
జాబిలమ్మ గిల్లుడే ఆగనంటది
ఆకలమ్మ ఏనాడు కడుపు దాటి పోయింది
దాహం అంతా కాళ్ళల్లో దాగి నిన్ను తాగింది
విరహాలు ఏటి కెరటాలు దాటి
మరు మల్లె పూల వరదల్లో తేలి
ఒడి చేరుకున్న ప్రేమలా వాలి పో ఇలా
వెన్నెల్లో వేసంకాలం
ఎండల్లో శీతాకాలం
నీ ఒళ్ళో సాయంకాలం హాయిలే హలా
ఏకంగా ఏలే రాజ్యం
యదలోనే రాసే పద్యం
ఆశల్లో పోసే ఆజ్యం కాదులే కలా
లాలి లాలి లాహిరి ఇదేమి లాహిరి
పండని పదె పదె పెదాల తిమ్మిరి