Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Railu Bandi
S.P. Charan, Sivardhini
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
క్కు క్కు క్కు
గంగోత్రి
రైలుబండి రైలుబండి కూతలోనె పాట ఉంది పాటలోని స్వరాలన్నీ
సరిగమ సరిగమ సరిగమ పదనిస
రైలుబండి రైలుబండి నడకలోనే నాట్యం ఉంది నాట్యంలోని జతులన్నీ
తకదిమి తకదిమి తకదిమి తకజణు
అలసటే లేని సంగీతాన్ని వినిపిస్తుందండి
మనుషుల మధ్య దురాలన్ని చెరిపేస్తుందీ రైలుబండి
క్కు క్కు క్కు
గంగోత్రి
కేరళలోన కొబ్బరి నీళ్ళు తాగిస్తుందండీ
కర్ణాటక బిసిబెళెబాత్ తినిపిస్తుందండీ
ఆంధ్రలోన పెసరట్టు ఉప్మా parcel కట్టించి
మహారాష్ట్రాలో మధ్యాహ్నానికి రోటీ ఇస్తుంది
ఆగ్రా సౌధం చూపించి సిమ్లా apple అందించి
హరిద్వారులో అడుగేసి హృషికేష్ లో తిప్పించి
గంగోత్రికి చక చకమంటూ పరుగులు తీస్తుంది
క్కు క్కు క్కు
గంగోత్రి
ఎండల్లోన మండుతు ఉన్నా నీడను మనకిచ్చి
వానల్లోన తానే తడిసి గొడుగవుతుందండీ
రాత్రంతా తను నిద్దరమాని మేల్కోంటుందండీ
అమ్మల్లే మనకూయలలుపి జోకొడుతుందండీ
సెలవులు తనకు వద్దంటూ స్నేహితులను మనకందిస్తూ
అందరి భారం మోసేస్తూ కోరిన తీరం చేరుస్తూ
మతమూ కులమను భేదం తనకు లేవంటుందండీ
మానవ జాతిని ఒకే తాటిపై నడిపిస్తుందడీ
క్కు క్కు క్కు
గంగోత్రి
(రైలుబండి రైలుబండి కూతలోనె పాట ఉంది పాటలోని స్వరాలన్నీ
రైలుబండి రైలుబండి కూతలోనె పాట ఉంది పాటలోని స్వరాలన్నీ)