Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Yemaindo Manasa
Prakash Parigosh
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
అటు ఇటు అని ఏమైందో మనసా
నిలవవుగా ఓ చోటిలా
ఎటు నడిచినా నీ చివరి అడుగు
తనవైపని తెలిపేదెలా
కథ అనను ఇది కల అనను
మరి ఏదో మాయన్నా నే నమ్మను
ఎన్ని ప్రశ్నలేసినా ఇంక ఏమి చెప్పను
నీతో నిజమల్లే సాగేటి నీడను
ఇన్ని జరిగేందుకే మొదలయ్యిందేమో
నేడు నీ మనసుతో నాకు పరిచయము
ఇన్ని జరిగేందుకే మొదలయ్యిందేమో
నేడు నీ మనసుతో నాకు పరిచయము
అటు ఇటు అని ఏమైందో మనసా
నిలవవుగా ఓ చోటిలా
నే చూసిన నిన్నలో నాతో మాత్రం నేనున్నా
నా రేపటి లోకంలో నిన్ను చూస్తున్నా
అలసట తెలియదు అడుగిక ఆగదు
నువ్వు చేయి కలపవే నాతో జత కలిపేస్తూ
ఎందుకింతగా నన్ను చంపుతోందిలా
ఎంత తప్పించుకున్నా నీ నవ్విలా
ఒక్క చూపుకే వాలిపోయా వింతగా
అడుగేస్తున్నా నీవెంట నేనిలా
ఇన్ని జరిగేందుకే మొదలయ్యిందేమో
నేడు నీ మనసుతో నాకు పరిచయము
అటు ఇటు అని ఏమైందో మనసా
నిలవవుగా ఓ చోటిలా
నా మనసే లాగింది నీలో ఏదో నచ్చింది
నీ నీడకు చేరాకే ప్రాణం వచ్చింది
నిజమిక నువ్వని మనమొక జంటని
దూరం లేదని మనసులు ముడి పడి
ఒక్కసారిగా నిండు గుండెలోపల ఉప్పెనొచ్చినట్టుగా ఉందేంటిలా
ముందు లేదుగా లోన ఇంత హాయిగా
అరె నీవల్ల ఇన్నేసి వింతలా
ఇన్ని జరిగేందుకే మొదలయ్యిందేమో
నేడు నీ మనసుతో నాకు పరిచయము
అటు ఇటు అని ఏమైందో మనసా
నిలవవుగా ఓ చోటిలా