Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Theme Of Kalki
Santhosh Narayanan, Kala Bhairava, Ananthu, Gowtham Bharadwaj
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
అధర్మాన్ని అణిచెయ్యగ
యుగయుగాన జగములోన
పరిపరి విధాల్లోన విభవించే
విక్రమ విరాట్రూపమితడే
స్వధర్మాన్ని పరిరక్షించగ
సమస్తాన్ని ప్రక్షాళించగ
సముద్భవించే అవతారమిదే
మీనమై పిదప కూర్మమై
తను వరాహమై మనకు సాయమై
నీ బాణమై కరకు ఖడ్గమై
చురుకు ఘూతమై మనకు ఊతమై
నిశి తొలిచాడు దీపమై
నీ నిధనం తన ధ్యేయమై
వాయువే వేగమై
కలియుగ స్థితి లయలే
కలబోసే కల్కి ఇతడే
స్వధర్మాన్ని పరిరక్షించగ
సమస్తాన్ని ప్రక్షాళించగ
సముద్భవించే అవతారమిదే
ప్రార్థనో మధుర కీర్తనో
హృదయ వేదనో మన నివేదనం
అందితే మనవి తక్షణం
మనకు సంభవం అతడి వైభవం
అధర్మాన్ని అణిచెయ్యగ
యుగయుగాన జగములోన
పరిపరి విధాల్లోన విభవించే
విక్రమ విరాట్రూపమితడే
స్వధార్మాన్ని పరిరక్షించగ
సమస్తాన్ని ప్రక్షాళించగ
సముద్భవించే అవతారమిదే