Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ammane Ayyanura Nee Rakatho
Chitra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఒహో ఒహో ఒహో ఒహో
హో హొ హో హో హొ హో
అమ్మనే అయ్యానురా నీ రాకతో
కమ్మనీ ఆనందమే నిండాలి నీతో
ఓ జాబిలి కూనా లాలిజో
నవ్వుల నానా లాలిజో
మా కలలకు రూపం కంటికి దీపం
ప్రేమకు ప్రతిరూపం
ఒహో ఒహో ఒహో ఒహో
నిన్ను కన్న తల్లికి
దక్కలేని భాగ్యమే
అమ్మా అనే మాటకి
నేనే నోచకుంటిరా
ఒహో ఒహో
మోసే బరువు లేకుండా
పురిటి బాధ రాకుండా
నన్నే తల్లిని చేసావయ్యా
ఇన్ని నాళ్లకి
కన్నది ఎవరైనా నీకున్నది ఈ అమ్మ
ఎన్నడు ఏమైనా నను వదలకురా నాన్న
చిగురు ఎరుగని తోటే చిగరించెనురా
చిరు చిరు నవ్వులకి
ఒహో ఒహో ఒహో ఒహో
కళ్లే మూసి వుంచినా
కలలో నీవే నాయనా
ఊహాల్లోనూ ఊపిరిలోనూ ఉయ్యాలూగగా
ఒహో ఒహో
కన్నె పేగు దీవెన
పెంచే ప్రేమ లాలనా
కాపాడాలే నిన్నే చిన్నా
కంటి రెప్పగా
ఎక్కడ నీవున్నా నా ఆశలు నీవమ్మా
నీతో నీడల్లే నా ప్రాణం ఉందమ్మా
నువ్వు ఇంతకు ఇంతై
అంతకు అంతై ఎదగరా ఓనానా
ఒహో ఒహో ఒహో ఒహో
అమ్మనే అయ్యానురా నీ రాకతో
కమ్మనీ ఆనందమే నిండాలి నీతో
ఓ జాబిలి కూనా లాలిజో
నవ్వుల నాన లాలిజో
మా కలలకురూపం కంటికిదీపం
ప్రేమకు ప్రతిరూపం
ఒహో ఒహో ఒహో ఒహో