Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Thellaraga
Pramod Kumark
Popularity · Low
+
Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
తెల్లారగా నిద్దురలేస్తే నాలోకం నాది
రోజంతా అంటుకు తిరిగే
నా పనులే నావి
ఏ గోడవకు వెళ్లనివాడ్ని
ఏ పిల్లను సూడనివాడ్ని
ఏ గోడవకు వెళ్లనివాడ్ని
ఏ పిల్లను సూడనివాడ్ని
పల్లెలో గోపాలుడ్ని
ఊరంత నే అయినోడ్ని
అట్టాంటి నన్నెట్టాగ మార్చేసిందో సిన్నారి
తన వెంటే అంటుకు తిరిగే
మంత్రం వేసిందే ఆ వయ్యారి
తెల్లారగా నిద్దురలేస్తే నాలోకం నాది
రోజంతా అంటుకు తిరిగే
నా పనులే నావి
పొలం గట్టుకాడకొస్తది సద్దీబువ్వ మోసుకొస్తది
గట్టుపైన నడకను చూస్తే
రాయంచ గుర్తుకొస్తది
ఏటికాడ నీటికొస్తది సెలిమెలాగా నవ్వుతుంటది
నీటి కడవా నీరుని దోస్తే
ఆ నవ్వూ నను దోస్తాది
ఈత సెట్టులాంటి సిన్నది
తీపి ముల్లు గుచ్చుకున్నది
మూడుముళ్లు ఏసేదాకా మనసుకు
కునుకే పట్టకున్నది
మట్టె గాజులెయ్యమన్నది
కాలు మెట్టె తొడగమన్నది
ఊరినడుమ రాములోరి గుళ్లో
తాళిబొట్టు కట్టమన్నది
పాలు నీళ్లు కలిసినట్టుగా
నాలోకలిసే సింగారి
నా సిట్టి గుండె పొదరింటిలో
కాపురముండే దేవేరి