Skip to content

Vaana Vaana

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

వానా వానా వానా నీలాకాశంలోనా నీతో చెందేసి ఆడనా వానా వానా వానా మేఘాలాపనలోనా నేనూ ఓ పాట పాడనా పన్నీటి పూలతోనా ఊసులాడుకోనా పసిపాపలా హరివిల్లునే చేయ్ చాపి అందుకోనా వానా వానా వానా నీలాకాశంలోనా నీతో చెందేసి ఆడనా వానలోనా కాగితాలా పడవలేసే చిలిపి ప్రాయం ఇంకా గురుతే చిన్ని నేస్తం యేటిలోనా గాలమేసీ ఎదురు చూసే మనసు పాపం మదిలో మెదిలే నాటి బాల్యం వాన నీటిలో ఆడుకున్న ఈతలూ జామ తోటలో పాడుకొన్న పాటలూ మరుపే లేని తియ్యనైన జ్ఞాపకాలు వానా వానా వానా నీలాకాశంలోనా నీతో చెందేసి ఆడనా నింగిలోనా మబ్బుకూనా అందుకుందీ చినుకు రాగం దాహం కోరే నేల కోసం నేలపైనా నీటి వీణ పల్లవించే మబ్బు కోసం స్నేహం పంచే పూల గీతం కోయిలమ్మతో పాటు కొంటె పాటలూ జాబిలమ్మతో ఎన్ని జాము రాత్రులూ మరుపే లేని తియ్యనైన జ్ఞాపకాలు వానా వానా వానా నీలాకాశంలోనా నీతో చెందేసి ఆడనా వానా వానా వానా మేఘాలాపనలోనా నేనూ ఓ పాట పాడనా పన్నీటి పూలతోనా ఊసులాడుకోనా పసిపాపలా హరివిల్లునే చేయ్ చాపి అందుకోనా వానా వానా వానా నీలాకాశంలోనా నీతో చెందేసి ఆడనా