Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Chinnari Thalli
Sathyaprakash D
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
చిన్నారి తల్లీ చిన్నారి తల్లీ నా నింగి జాబిలీ
నీ వెన్నెలంది వెలుగొందుతోంది నా గుండె లోగిలి
నీ ఊసులోనే ముసరాడుతోంది. ఈ నాన్న ఊపిరి
కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దరి
ఎన్నాళ్ళు ఉన్నానంటే
ఉన్నానంటూ ఏకాకి మాదిరి
ఆరారీరారో రారో రారో ఆరారీరారో
ఆరారీరారో రారో రారో ఆరారీరారో
ఆరారీరారో రారో రారో ఆరారీరారో
ఆరారీరారో రారో రారో ఆరారీరారో
చిన్నారి తల్లీ చిన్నారి తల్లీ నా నింగి జాబిలీ
నీ వెన్నెలంది వెలుగొందుతోంది నా గుండె లోగిలి
కను చివరన జారే తడి చినుకును సైతం
సిరితళుకుగా మార్చే చిత్రం నీవే
కలతగపొల మారే ఎద మంటల గ్రీష్మం
సులువుగా మరిపించే మంత్రం నీవే
నువ్వంటే నా సొంతమంటూ పలికిందీ మమకారం
ఆ మాటే కాదంటూ దూరం నిలిపిందే అహంకారం
తలవాల్చి నువ్వలా ఒడిలోన వాలగా
నిండు నూరేళ్ళ లోటు తీరిపోదా అదే క్షణానా
చిన్నారి తల్లీ చిన్నారి తల్లీ నా నింగి జాబిలీ
నీ వెన్నెలంది వెలుగొందుతోంది నా గుండె లోగిలి
నిదురించు వేళ నీ నుదుట నేను ముత్యాల అంజలీ
జోలాలి పాడి తెరిచాను చూడు స్వప్నాల వాకిలి
ఏ బూచి నీడ నీపై రానీకుండా నేనేగా కావలి
ఆరారీరారో రారో రారో ఆరారీరారో
ఆరారీరారో రారో రారో ఆరారీరారో
ఆరారీరారో రారో రారో ఆరారీరారో
ఆరారీరారో రారో రారో ఆరారీరారో
చిన్నారి తల్లీ చిన్నారి తల్లీ