Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Anna Chellela
S.P.Balasubramanyam & Chitra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
అన్నా చెల్లెలి అనుబంధం
జన్మ జన్మలా సంబంధం
జాబిలమ్మకిది జన్మదినం
కోటితారకల కోలాహాలం
అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్ని
అరచేతిలోనా హారివిల్లై
గోరింట పండగా
మా ఇంట పండగా
అన్నా చెల్లెలి అనుబంధం
అంతులేనిదీ ఆనందం
జాబిలమ్మకిది జన్మదినం
కోటితారకల కోలాహలం
అన్నయ్య ప్రేమే అరచేతిలోనా
అందాల రేఖలు అవుతుంటే
గోరింట పండగా
మా ఇంట పండగా
విరిసినది వెన్నెలేయిలా
అచ్చు నా చెల్లి నవ్వులా
స్వర్గమే నేరుగా మా ఇంట వాలగా
కురిసినది ప్రేమ చినుకులా
అదే మా అన్న చూపులా
కన్నులే తడిసెనే నవ్వినా హాయిగా
నీ కంటకి రెప్పను నేనై తోడుగ ఉన్నాలే
నీ గుండెకు ఊపిరి నేనై ఎపుడూ ఉంటాలే
అందుకే నువు లేక నే లేనులే
ప్రతి జన్నలోన నీ చెల్లినయ్యె
వరమివ్వు నాకు చాలంటా
దేవతల మాట నా నోటి వెంట
దీర్ఘాయుష్మాన్ భవా
అన్నా చెల్లెలి అనుబంధం
జన్మ జన్మలా సంబంధం
జాబిలమ్మకిది జన్నదినం
కోటి తారకల కొలాహలం
బుడి బుడీ నడకలు ఎన్నో
నేర్పిన కన్న తండ్రిలా
పాదమే, కందనీ, ఓ పూల దారిలా
చిరు చిరు గోరుముద్దలే
తినిపించు కన్న తల్లిలా
తులసివై,వెలసినా, ఈ ఇంటి దేవత
అన్నా, అన్న మాటే కాదా నాకిక ఓంకారం
చెల్లీ, నువు పుట్టిన రోజె ప్రేమకు శ్రీకారం
మా ఇల్లు అనురాగ గుడి గోపురం
సిరులెన్ని ఉన్న సరి తూగలేవు
నా చెల్లి చిన్ని నవ్వులకు
నీ పాద స్పర్శ శ్రీరామరక్ష మాతృదేవోభవా
అన్నా చెల్లెలి అనుబంధం
అంతులేనిదీ ఆనందం
జాబిలమ్మకిది జన్మదినం
కోటితారకల కోలాహలం
అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ
అరచేతిలోన హరివిల్లై
గోరింట పండగా
మా ఇంట పండగా