Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kondapaina Vendivaana
S.P. Balasubrahmanyam, P. Susheela, S. P. Kodandapani
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
కొండపైన వెండివాన
అది గుండెల్లో కొత్తవలపు కురిపించాలి
ఆ కొత్తవలపు కోరికలను పండించాలి
కొండపైన వెండి వానా
ఆ ఆ
మబ్బులు వస్తూ పోతుంటాయి నిలిచేదొకటే నీలాకాశం
కలతలు వస్తూ పోతుంటాయి మిగిలేదొకటే వలచే హృదయం
కన్నీళ్లలో కలకల నవ్వీ కలహాలలో చెలిమిని పెంచీ
కలలాగా బ్రతుకంతా జీవించాలీ
కొండపైన వెండి వానా
ఆ ఆ
నిప్పులు చెరిగే వేసవితోనే తేనెలు కురిసే వానొస్తుందీ
ఆకులు రాల్చే కాలంతోనే చిగురులు తొడిగే ఘడియొస్తుందీ
అనురాగమే తీయని వరమై ఆనందమే తరగని సిరియై
కలకాలం కాపురం సాగించాలి
కొండపైన వెండివాన
అది గుండెల్లో కొత్తవలపు కురిపించాలి
ఆ కొత్తవలపు కోరికలను పండించాలీ