Skip to content

Mellaga Mellaga - Female

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటు తూరుపు వెచ్చగా చేరంగా సందె సూర్యుడే సూటిగా వచ్చి చిలిపిగా చెంపనే గిచ్చి తలపులు తలుపులు తీయంగా ఎగిరే పావురం తీరుగా మనసే అంబరం చేరగా కల మేలుకన్నది ఇలనేలుతున్నది మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటూ తూరుపు వెచ్చగా చేరంగా చిట్ చిట్ చిట్ చిట్ చిట్ చిట్ చిట్ చిటి పొటి పిచుకా చిత్రంగా ఎగిరే రెక్కలు ఎవరిచ్చారు పట్ పట్ పట్ పట్ పట్ పరుగుల సీతాకోకా పదహారు వన్నెలు నీకు ఎవరిచ్చారు చిన్ని చిన్ని రేకుల పూలన్నీ ఆడుకుందాo రమ్మన్నాయయి తలలూపి కొమ్మ మీది కోయిలమ్మ నన్ను చూసీ పాడుతుంది గొంతు కాస్త శృతి చేసి మధుమాసమై ఉంటే ఎద సంతోషమే కదా సదా అమ్మమ్మా మబ్బుల తలుపులున్న వాకిలి తీసి రమ్మంటుంది నింగి లోగిలి మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటూ తూరుపు వెచ్చగా చేరంగా తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుల్లే ఉడత మెరుపల్లే ఉరికే వేగం ఎవరిచ్చారు జల్ జల్ జల్ జల్ జల్ జల్ జల పారే యేరా ఏవరమ్మా నీకీ రాగం నేర్పించారు కొండతల్లి కోనకిచ్చు పాలేమో నురుగుల పరుగుల జలపాతం వాగు మొత్తం తాగే దాకా తగ్గదేమో ఆశగ ఎగిరే పిట్ట దాహం మధుమాసమై ఉంటే యెద సంతోషమే కదా సదా అమ్మమ్మా మబ్బుల తలుపులున్న వాకిలి తీసి రమ్మంటుంది నింగి లోగిలి మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటూ తూరుపు వెచ్చగా చేరంగా సందె సూర్యుడే సూటిగా వచ్చి చిలిపిగా చెంపనే గిచ్చి తలపులు తలుపులు తీయంగా ఎగిరే పావురం తీరుగా మనసే అంబరం చేరగా కల మేలుకున్నది ఇలనేలుతున్నది పా ప పా పా ప పా మ గ మా మ మా మా మ మా గ రి గా గ గా గా గ గా రి స రి పా ప పా పా ప పా మ గ మా మ మా మా మ మా గ రి గా గ గా గా గ గా రి స రి