Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Dandalayya Undralayya
S. P. Balasubramanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
జై జై జై జై గణేశ జై జై జై జై
జై జై జై జై వినాయక జై జై జై జై
(జై జై జై జై గణేశ జై జై జై జై)
(జై జై జై జై వినాయక జై జై జై జై)
దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా
నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ
పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా
తండ్రి వలే ఆదరించి
తోడు నీడ అందించయ్యా ఓ
(దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా)
ఓహో
(నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ)
చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా
పాపం కొండంత నీ పెనుభారం
ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా
ఓ హో హో జన్మ ధన్యం
చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా
పాపం కొండంత నీ పెనుభారం
ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా
ఓ హో హో జన్మ ధన్యం
(హొయ్ హొయ్ హొయ్)
అంబారిగా ఉండగల ఇంతటి వరం
అయ్యోరా అయ్యా
అంబాసుతా ఎందరికి లబించురా
అయ్యోరా అయ్యా
ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా
(దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా)
(నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ)
శివుని శిరసు సింహాసనం
పొందిన చంద్రుని గోరోజనం
నిన్నే చేసింది వేళాకోళం
ఎక్కిన మదం దిగిందిగా
తగిన ఫలం దక్కిందిగా
ఏమైపోయింది గర్వం
(హొయ్ హొయ్ హొయ్)
శివుని శిరసు సింహాసనం
పొందిన చంద్రుని గోరోజనం
నిన్నే చేసింది వేళాకోళం
ఎక్కిన మదం దిగిందిగా
తగిన ఫలం దక్కిందిగా
ఏమైపోయింది గర్వం
(హొయ్ హొయ్ హొయ్)
త్రిమూర్తులే నిను గని తలొంచరా
అయ్యోరా అయ్యా
నిరంతరం మహిమను కీర్తించరా
అయ్యోరా అయ్యా
నువ్వెంత అనే అహం నువ్వే దండించరా
దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా
నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ
అరె రె రె పిండి వంటలారగించి
తొండమెత్తి దీవించయ్యా
తండ్రి వలే ఆదరించి
తోడు నీడ అందించయ్యా ఓ
(దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా)
(నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ)
(జై జై జై జై)
(దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా)
(నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ)