Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Manchini Samadhi
S.P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయనివాడూ ఎవడో చెప్పండి
ఏ దోషం లేనివాడూ ఎవడో చూపండి
మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయనివాడూ ఎవడో చెప్పండి
ఏ దోషం లేనివాడూ ఎవడో చూపండి
కత్తితో ఛేదించనిదీ కరుణతో ఛేదించాలి
కక్షతో కానిదీ క్షమాభిక్షతో సాధించాలి
తెలిసీ తెలియక కాలుజారితే
తెలిసీ తెలియక కాలుజారితే చేయూతనిచ్చి నిలపాలి
మనలో కాలుజారనివరూ ఎవరో చెప్పండి
లోపాలు లేనివారూ ఎవరో చూపండి
మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయనివాడూ ఎవడో చెప్పండి
ఏ దోషం లేనివాడూ ఎవడో చూపండి
గుడులలో లింగాలను మింగే బడా భక్తులు కొందరు
ముసుగులో మోసాలు చేసే మహావ్యక్తులు కొందరు
ఆకలి తీరక నేరం చేసే
ఆకలి తీరక నేరం చేసే అభాగ్య జీవులు కొందరూ
మనలో నేరం చేయని వాడూ ఎవడో చెప్పండి
ఏ దోషం లేనివాడూ ఎవడో చూపండి
మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయనివాడూ ఎవడో చెప్పండి
ఏ దోషం లేనివాడూ ఎవడో చూపండి
తప్పు చేసిన ఈ దోషినీ ఇప్పుడే శిక్షించాలి
మరుపురాని గుణపాఠం పదిమందిలో నేర్పించాలి
ఆహా అయితే
ఎన్నడు పాపం చేయనివాడూ
ఎన్నడు పాపం చేయనివాడూ ముందుగ రాయి విసరాలి
మీలో పాపం చేయని వాడే ఆ రాయి విసరాలి
ఏ లోపం లేనివాడే ఆ శిక్ష విధించాలి
మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయనివాడూ ఎవడో చెప్పండి
ఏ దోషం లేనివాడూ ఎవడో చూపండి