Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Yemunnave Pilla
Sid Sriram
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
లేత లేగదూడ పిల్ల తాగే
పొదుగులోని పాల రంగు నువ్వే
పచ్చ పైరు ఓని ఒంటికేసుకొని ఏమున్నావే
నింగి సాటుకున్న సినుకు నువ్వే
సూటిగా దూకేసి తాకినావే
ఎలిసిపోని వాన జల్లులాగా ఏమున్నావే
ఓ, మల్లెపూలన్నీ కుళ్ళుకునేలా
ఏమున్నావే పిల్ల ఏమున్నావే
తేనెటీగలన్నీ సుట్టుముట్టేలా
ఏమున్నావే పిల్ల ఏమున్నావే
సూరీడు సూడు పొద్దు దాటినా నిన్ను సూసి పోలేడే
సీకటి దాటినా సెందురుడు దాగే లాగా ఏమున్నావే
(ఏమున్నావే పిల్ల ఏమున్నావే
అందంతో బంధించావే
ఏమున్నావే పిల్ల ఏమున్నావే
సూపుల్తో సంపేశావే
ఏమున్నావే పిల్ల ఏమున్నావే
మాటల్లో ముంచేశావే
ఏమున్నావే పిల్ల ఏమున్నావే
నవ్వుల్తో ఊపిరి ఆపేసావే)
ఓ తొలి సినుకు సేరి ఈ నేల గాలి గుప్పించే మట్టి సువాసన నీది
పొత్తిల్లో దాగి ముద్దుల్లో తేలే పసిపిల్ల బుగ్గల్లో నునుపే నీది
నువ్వు నడిసే నడకల్లో నది పొంగుల హంగుంది
లేత నడుము మడతల్లో ఈ మాయల మనసుంది
వాలే రెండు కన్నుల్లో బోలెడంత సిగ్గు దాగుంది
వాలుజడ గుత్తుల్లో ఈ భూగోళం మొత్తముంది
(హే ఏమున్నావే పిల్ల ఏమున్నావే
అందంతో బంధించావే
ఏమున్నావే పిల్ల ఏమున్నావే
సూపుల్తో సంపేశావే
ఏమున్నావే పిల్ల ఏమున్నావే
మాటల్లో ముంచేశావే
ఏమున్నావే పిల్ల ఏమున్నావే
నవ్వుల్తో ఊపిరి ఆపేసావే)
ఓ ఎగిరేటి సిలకా గోరింక వంక ఓరా కన్నేసి సూసింది సూడు
తరిగేటి సొగసా కాదేమో బహుశా అయినా నవ్వేసి వచ్చింది నేడు
కారుమబ్బు సీకట్లో నీ వెన్నెల నవ్వుంది
ఆరుబయట వాకిట్లో ఆ సుక్కల ముగ్గుంది
జంట అయ్యే దారుల్లో నీ సిగ్గుల అడ్డుంది
వెంటవచ్చే అడుగుల్లో జన్మజన్మల తోడుంది
(ఏమున్నావే పిల్ల ఏమున్నావే
అందంతో బంధించావే
ఏమున్నావే పిల్ల ఏమున్నావే
సూపుల్తో సంపేశావే
ఏమున్నావే పిల్ల ఏమున్నావే
మాటల్లో ముంచేశావే
ఏమున్నావే పిల్ల ఏమున్నావే
నవ్వుల్తో ఊపిరి ఆపేసావే)