Skip to content

Chhoti Chhoti Aankhen

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

నిన్ను కన్న కనులే మెరిసెనుగా కన్నపేగు మరలా మురిసెనుగా నిన్నలన్ని వరమై కురిసెనుగా గుండెలన్ని తేనెలో తడిసెనుగా నేనే నిన్ను చెయ్యార పెంచని అమ్మ నీవే కదా కోట్లాది అమ్మల ప్రేమ పసివాడా పసివాడా ఏళ్ళెదిగిన పసివాడా కలలాగా కలిసావే నిన్నిక వీడెను గ్రహణపు నీడ నిన్నటికి ఇప్పటికి నీలో లేదే తేడా పసినవ్వులు రువ్వినది నీ పెదవులపై నీ మీసము కూడా నిన్ను కన్న కనులే మెరిసెనుగా కన్నపేగు మరలా మురిసెనుగా నిన్నలన్ని వరమై కురిసెనుగా గుండెలన్ని తేనెలో తడిసెనుగా తడి తగలని పుడమికి నేడూ చిరు చినుకే నీ రాకా జనుమలో ఇది జన్మం ఇక లోటేది నువు చేరాకా రక్తబంధమొచ్చి బలమిచ్చాక యుద్ధ విజయము ఖాయమికా ఏ పొగరిటు రాగలదికా మన చేతులు కలిసాకా సద్దే లేనే లేని నీరెండంటే నీవే అలసిన గుండెల నిండా నువు ఆనందాలను పొదిగావే పసివాడా పసివాడా ఏళ్ళెదిగిన పసివాడా కలలాగా కలిసావే నిన్నిక వీడెను గ్రహణపు నీడ ఆహా ఇదేం వాస్తవం కలలా ఉందే ఈ క్షణం నాతో ఇలా ఉన్నది నీవేనా నిజమేనా చెలియా నిన్నే కలవడం కాలాలనే గెలవడం కనుపాపలో కాంతిగా నీవేనా నిజమేనా చిరునామా తెలిసిన చిలకల్లే ఎదగూటిలో వాలావే కాలం కదలికలేవైనా నిలిచావే నీలానే పోదా పసివారై నిన్నల్లోకి ఉందా ఆ చోటే మనం ఎన్నటికీ నిన్ను కన్న కనులే మెరిసెనుగా కన్నపేగు మరలా మురిసెనుగా నిన్నలన్ని వరమై కురిసెనుగా గుండెలన్ని తేనెలో తడిసెనుగా