Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Sirivennala ::
Anurag Kulkarni
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
(డుం డక డుం డక డుం డక డుండుం)
(డుం డక డుం డక డుం డక డుం)
(డుం డక డుం డక డుం డక డుండుం)
(డుం డక డుం డక డుం డక డుం)
నెల రాజుని ఇల రాణిని
కలిపింది కదా సిరివెన్నెల
దూరమా దూరమా తీరమై చేరుమా
నడి రాతిరిలో తెరలు తెరచినది
నిద్దురలో మగత మరచి
ఉదయించినదా కులుకులొలుకు
చెలి మొదటి కల
తన నవ్వులలో తళుకు తళుకు
తన చంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝణకు ఝణకు
సరికొత్త కళా
(డుం డక డుం డక డుం డక డుండుం)
(డుం డక డుం డక డుం డక డుం)
(డుం డక డుం డక డుం డక డుండుం)
(డుం డక డుం డక డుం డక డుం)
హో చాంగురే ఇంతటిదా నా సిరి
అన్నది ఈ శారద రాతిరి
మిలమిలా చెలి కన్నుల
తన కళలను కనుగొని
అచ్చెరువున మురిసి
అయ్యహూ ఎంతటిదీ సుందరి
ఎవ్వరూ రారు కదా తన సరి
సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో
నారీ సుకుమారి
ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే
తెరదాటి చెరదాటి
వెలుగు చూస్తున్న భామనీ
సరిసాటి ఎదమీటి
పలకరిస్తున్న శ్యాముని
ప్రియమార గమనిస్తూ
పులకరిస్తోంది యామిని
కలబోసే ఊసులే విరబూసే ఆశలై
నవరాత్రి పూసిన
వేకువ రేఖలు రాసినదీ నవలా
మౌనాలే మమతలై
మధురాల కవితలై
తుది చేరని కబురులా
కథకళి కదిలెను
రేపటి కథలకు మున్నుడిలా
తన నవ్వులలో తళుకు తళుకు
తన చంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝణకు ఝణకు
సరికొత్త కళా
(డుం డక డుం డక డుం డక డుండుం)
(డుం డక డుం డక డుం డక డుం)
(డుం డక డుం డక డుం డక డుండుం)
(డుం డక డుం డక డుం డక డుం)
ఇదిలాని ఎవరైనా
చూపనే లేదు కంటికి
అదెలాగో తనకైనా
తోచనే లేదు మాటకి
ఇపుడిపుడే మనసైనా
రేపు దొరికింది చూపుకి
సంతోషం సరసన సంకోచం మెరిసినా
ఆ రెంటికీ మించినా
పరవశ లీలను కాదని అనగలవా
కథ కదిలే వరసనా
తమ ఎడలేం తడిసినా
గత జన్మల పొడవునా
దాచిన దాహము
ఇపుడే వీరికి పరిచయమా
తన నవ్వులలో తళుకు తళుకు
తన చంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝణకు ఝణకు
సరి కొత్త కళా
తన నవ్వులలో తళుకు తళుకు
తన చంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝణకు ఝణకు
సరి కొత్త కళా
(డుం డక డుం డక డుం డక డుండుం)
(డుం డక డుం డక డుం డక డుం)
(డుం డక డుం డక డుం డక డుండుం)
(డుం డక డుం డక డుం డక డుం)