Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Maruvakuma Anuragam
P. Susheela, S.P. Balasubrahmanyam
Popularity · Low
+
Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
హా హా హా హా ఆ హాహహా హా
హా హా హా హా ఆ ఆ ఆ హా
మరువకుమా అనురాగం
మనుగడలో మకరందం
ఈ మధుమాసం మనకోసం
ప్రేమ పల్లవించి
పూలు పూసే కౌగిలింతలో
సంతకాలు చేసిపోయే జీవితాలలో
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
మరువకుమా అనురాగం
మనుగడలో మకరందం
ఆమని తేనెలు పొంగే వేళల్లో
ప్రేమని కోయిల పాడే వేళల్లో
పూవే గంధాలు పూసి
నాలో ప్రాణాలు పోసి
కుంకుమ వీణల సంధ్యా రాగమే
పండిన ప్రేమకు తాంబూలమై
మూగ చూపులల్లుకుంది రాగమెప్పుడో
కన్నె గుండె చేరుకుంది తాళమెప్పుడో
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
మరువకుమా అనురాగం
మనుగడలో మకరందం
రేపటి చల్లటి వెలుగు నీడల్లో
నిన్నటి సన్నటి వెన్నెల జాడల్లో
నీవే నేనైనా వేళా
మాటే మూగైన వేళా
తోటకు వేసవి రానే రాదులే
పాటా పల్లవి నీవూ నేనులే
జాజిపూల మాలలంటి జ్ఞాపకాలలో
పూవులార బోసుకున్న జీవితాలలో
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
మరువకుమా అనురాగం
మనుగడలో మకరందం
ఈ మధుమాసం మనకోసం
ప్రేమ పల్లవించి
పూలు పూసే కౌగిలింతలో
సంతకాలు చేసిపోయే జీవితాలలో
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
మరువకుమా అనురాగం
మనుగడలో మకరందం
హా హా హా హా ఆ హాహహా హా
హా హా హా హా ఆ ఆ ఆ హా