Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Naa Gundello
Yazin Nizar; Nikhita Gandhi
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నా గుండెల్లో ఉండుండి మెల్లంగా
ఝల్లుమందే ఏమయ్యిందో
నా ఊహల్లో నువ్వొచ్చి వాలంగా
ఇష్టంగుంది ఏమౌతుందో
మదిలో మెదిలే మాటలనే
పెదవే దాచనందే
ఎదలో ఎగసే అలజడినే
అడగాలి మన కధే
ఓ నా గుండెల్లో ఉండుండి మెల్లంగా
ఝల్లుమందే ఏమయ్యిందో
ఏల అందిందే? ఆకాశం అందేసిందే
ఏల ఆనందం పొంగిదే?
ఏల అల్లిందే? ఉల్లాసం అల్లేసిందే
ఏల ఒళ్లంతా తుళ్లిందే?
ఇంచు మించుగా ఊపిరాగేట్టుందిలే
నువ్వే చూసి చూడనట్టు వెళ్లకే
కొంచెం కొంచెంగా మౌనం కరిగేట్టుందిలే
నువ్వే మంత్రం వేసి మనసే లాగితే
మన మాటే
పాటగా మారనీ
మన పాటే
ప్రేమగా సాగనీ
ఆ ప్రేమే స్వప్నమై సత్యమై స్వర్గమైపోనీ
మన కలయికలో
నా గుండెల్లో ఉండుండి మెల్లంగా
ఝల్లుమందే ఏమయ్యిందో
మంచు పువ్వంటి చిన్ని నవ్వు నవ్వేస్తే
పంచ ప్రాణాలన్నీ మళ్లీ పుట్టేలే
పంచదారంటి తీపి ఊసులాడేస్తే
లక్ష నిమిషాలైనా ఇట్టే గడిచేలే
సంద్రమైనా చిటికెలో దాటనా
సందెపొద్దు జిలుగులో చేరనా
మధురం మధురం మధురం మన ఈ ప్రేమం
సుమధుర కావ్యం
నా గుండెల్లో ఉండుండి మెల్లంగా
ఝల్లుమందే ఏమయ్యిందో
నా ఊహల్లో నువ్వొచ్చి వాలంగా
ఇష్టంగుంది ఏమౌతుందో
మదిలో మెదిలే మాటలనే
పెదవే దాచనందే
ఎదలో ఎగసే అలజడినే
అడగాలి మన కధే