Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ee Madhumaasamlo
S. P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగ
ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగ
ఆకాశం అంచులు దాటే ఆవేశం నా గీతం
అందులోని ప్రతి అక్షరము అందమైన నక్షత్రం
ఆ గీతం పలికిన నా జీవితమే సంగీతం
సంగమించు ప్రణయంలో ఉదయరాగ సింధూరం
ప్రేమే పెన్నిధిగా
దైవం సన్నిధిగా
ప్రేమే పెన్నిధిగా
దైవం సన్నిధిగా
సమశృతిలో జత కలిసి
ప్రియలయలో అదమరచి అనురాగాలు పలికించువేళ
ఈ మధుమాసంలో
ఈ దరహాసంలో
మదిలో
కదిలి
పలికే కోయిల
బ్రతుకే హాయిగ
అందమైన మన ఇల్లు అవని మీద హరివిల్లు
ఋతువులెన్ని మారినా వసంతాలు వెదజల్లు
తెలవారిన సంధ్యలలో తేనె నీటి వడగళ్ళు జ్ఞాపకాల నీడలలో కరుగుతున్న కన్నీళ్ళు
ఒకటే ఊపిరిగా
కలలే చూపులుగా
ఒకటే ఊపిరిగా
కలలే చూపులుగా
మనసులలో మనసెరిగి
మమతలనే మధువొలికే శుభయోగాలు తిలకించువేళ
ఈ మధుమాసంలో
ఈ దరహాసంలో
మదిలో
కదిలి
పలికే కోయిల బ్రతుకే హాయిగ
రచన: వేటూరి