Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Yevaroo Leni Chota
P. Susheela
,
Ghantasala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఎవరూ లేని చోటా ఇదిగో చిన్న మాటా
ఎవరూ లేని చోటా ఎయ్ ఇదిగో చిన్న మాటా
ఇంకా ఇంకా ఇంకా చేరువ కావాలీ
ఇద్దరు ఒకటై పోవాలీ
ఎవరూ లేని చోటా ఇదిగో చిన్నమాటా
ఎవరూ లేని చోటా ఎయ్ ఇదిగో చిన్న మాటా ఆ ఆ
చిలిపి ఊహలే రేపకూ ఊ
సిగ్గు దొంతరలు దోచకూ ఊ
చిలిపి ఊహలే రేపకూ సిగ్గు దొంతరలు దోచకూ
జిలిబిలి ఆశలు పెంచకు పెంచకు పెంచకూ
పెంచి నన్ను వేదించకూ ఊ
ఒంపులతో ఊరించకు ఉసి గొలిపి వారించకు
ఒంపులతో ఊరించకు ఉసి గొలిపి వారించకు
కలిగిన కోరిక దాచకు దాచకు దాచకూ
దాచి నన్ను దండించకూ ఊ
ఎవరూ లేని చోటా ఇదిగో చిన్నమాటా
ఎవరూ లేని చోటా ఎయ్ ఇదిగో చిన్న మాటా ఆ ఆ
కాదని కౌగిలి వీడకూ ఊ
కలలో కూడ కదలకూ ఊ
కాదని కౌగిలి వీడకూ కలలో కూడా కదలకూ
కలిగే హాయిని ఆపకు ఆపకు ఆపకూ
ఆపి నన్ను ఆడించకూ ఊ
ఒడిలో చనువుగ వాలకు దుడుకుతనాలు చూపకు
ఒడిలో చనువుగ వాలకు దుడుకుతనాలు చూపకు
ఉక్కిరి బిక్కిరి చేయకు చేయకు చేయకూ
చేసి మేను మరిపించకూ ఊ
ఎవరూ లేని చోటా ఇదిగో చిన్న మాటా
ఇంకా ఇంకా ఇంకా చేరువ కావాలీ
ఇద్దరు ఒకటై పోవాలీ
ఎవరూ లేని చోటా ఇదిగో చిన్న మాటా ఆ ఆ