Skip to content

Taralirada

S.P. Balasubrahmanyam
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాక అల సాగకుంటె మేఘాలరాగం ఇల చేరుకోదా తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం ఏవీ సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం ఇది తెలియని మనుగడ కధ దిశలెరుగని గమనము కద తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం బ్రతుకున లేని శృతి కలదా ఎద సడిలోనే లయ లేదా బ్రతుకున లేని శృతి కలదా ఎద సడిలోనే లయ లేదా ఏ కళకైనా ఏ కలకైనా జీవితరంగం వేదిక కాదా ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం కూసే కోయిల పోతే కాలం ఆగిందా మారే ఏరే పారే మరో పదం రాదా మురళికిగల స్వరమున కళ పెదవిని విడి పలకదుకద తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాక అల సాగకుంటె మేఘాలరాగం ఇల చేరుకోదా తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం