Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Vaadutha Marachedhavala
A.M. Rajah, P. Susheela
Popularity · Low
+
Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
వాడుక మరచెదవేలా
నను వేడుక చేచెదవేలా
నిను చూడని దినము
నాకొక యుగము
నీకు తెలుసును నిజము
నీకు తెలుసును నిజము
వాడుక మరువను నేను
నిను వేడుక చేయగలేను
నిను చూడని క్షణము
నాకొక దినము
నీకు తెలుసును నిజము
నీకు తెలుసును నిజము
సంధ్య రంగుల చల్లని గాలుల
మధురరాగము మంజుల గానము
సంధ్య రంగుల చల్లని గాలుల
మధురరాగము మంజుల గానము
తేనె విందుల తీయని కలలు
మరచిపోయిన వేళ
ఇక మనకి మనుగడ ఎలా
నీ అందము చూపి గందము పూసి
ఆశ రేపెదవేలా
ఆశ రేపెదవేలా
ఓ సంధ్య రంగులు సాగినా
చల్లగాలులు ఆగినా
సంధ్య రంగులు సాగినా
చల్లగాలులు ఆగినా
కలసి మెలసిన కన్నులలోన
కలసి మెలసిన కన్నులలోన
మనసు చూడగలేవా
మరులు తోడగలేవా
వాడుక మరువను నేను
నిను వేడుక చేయగలేను
నిను చూడని క్షణము
నాకొక దినము
నీకు తెలుసును నిజము
నీకు తెలుసును నిజము
ఆ... కన్నులా ఇవి కలల వెన్నెలా
చిన్నె వన్నెల చిలిపి తెన్నులా
కన్నులా ఇవి కలల వెన్నెలా
చిన్నె వన్నెల చిలిపి తెన్నులా
మనసు తెలిసి మర్మమేలా
ఇంత తొందర ఏలా
ఇటు పంతాలాడుటమేలా
నాకందరి కన్నా ఆశలు ఉన్నా
హద్దు కాదనగలనా
హద్దు కాదనగలనా
వాడని నవ్వుల తోడ
నడయాడెడు పువ్వుల జాడ
అనురాగము విరిసి లోకము మరచి
ఏకమౌదము కలసి
ఏకమౌదము కలసి