Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Devuda Devuda
S. P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
అరె అరె అరె అరె అరె అరే
దేవుడ దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్లు విప్పి చూడరా
దేవుడ దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్లు విప్పి చూడరా
నా వాళ్ళ హృదయాలు
నిజమైన వజ్రాలు
నువు కొంచెం సానపెట్టరా
Repeat-eh
నా వాళ్ళ హృదయాలు
నిజమైన వజ్రాలు
నువు కొంచెం సానపెట్టరా
శక్తులన్నీ వచ్చి చేరుకుంటే (ఓ ఓ ఓ)
స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే (ఓ ఓ ఓ)
దేవుడ దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్లు విప్పి చూడరా
ఓ ఆరె ఆరే ఆరె ఆరే అరెరే ఆరే అరెరే ఆరే
ఆలోచించు కొంచెం రైతుబిడ్డ కష్టం
అందరి ఆకలి తీర్చేటందుకు
ఓడుస్తాడు స్వేదం
వాడలోని మలినం శుభ్రం చేసేవారు
నాలుగు రోజులు రాకపోతే
కుళ్ళిపోదా ఊరు
మాసిన జుట్టు పనీ పట్టె వాడంటూ లేకుంటే
తగ్గుతుందా తల బరువూ
నీళ్లలోనే నిలిచి ఉతికే వాడంటూ లేకుంటే
నిలుచునా మన పరువూ
ఏ పని ఎవరు చేస్తేనేమి
వృత్తే మనకు దైవం అని
బ్రహ్మంగారు నాడే అన్నారోయ్
Repeat-eh
శక్తులన్నీ వచ్చి చేరుకుంటే (ఓ ఓ ఓ)
స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే (ఓ ఓ ఓ)
ఆ దేవుడ దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్లు విప్పి చూడరా
నీ గురించి ఎవరో అరె ఏమనుకుంటే ఏమి
ఈ చెవితోటి విన్నాగాని ఆ చెవిలోంచి వదిలేయ్
మేఘం సాగుతున్నా కాకులు మూగుతున్నా
ఆకాశానికి మలినాలేవి అంటుకోవని చెప్పి
పూలబంతి పట్టి నీటి మధ్యలో ఉంచినా
తేలుతుందోయ్ పైకి సోదరా
అరె నిన్నే ఎవరో దూరం పెట్టినా నెట్టినా
తేలిరారా పూలబంతిలా
మిణుగురు పురుగులు ఎన్నెన్నున్నా
పున్నమినాటి జాబిలి చల్లే
పండు వెన్నెలను ఆపగలరా
Repeat-eh
శక్తులన్నీ వచ్చి చేరుకుంటే (ఓ ఓ ఓ)
స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే (ఓ ఓ ఓ)
దేవుడ దేవుడా తిరుమల దేవుడా
(అరె అరె అరె అరె అరె అరె అరే)
చూడర చూడరా కళ్లు విప్పి చూడరా
(అరె అరె అరె అరె అరె అరె అరే)
నా వాళ్ళ హృదయాలు
నిజమైన వజ్రాలు
నువు కొంచెం సానపెట్టరా
Repeat-eh
(నా వాళ్ళ హృదయాలు)
(నిజమైన వజ్రాలు)
(నువు కొంచెం సానపెట్టరా)
శభాషు
శక్తులన్నీ వచ్చి చేరుకుంటే (ఓ ఓ ఓ)
స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే (ఓ ఓ ఓ)