Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Prema Yathralaku
K. S. Chithra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
యవ్వనాల పువ్వులన్నీ నవ్వుకున్నతోటలో ప్రేమయాత్ర చేద్దామా
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
వేడిముద్దు అద్దుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా
కులుకు లొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో

యవ్వనాల పువ్వులన్నీ నవ్వుకున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామ
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
జవ్వనాలు గిల్లుకున్న వన్నెలమ్మకి ఆ వెన్నెలమ్మ జాడ చెప్పవా
చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా

వెన్నెల పొదలో మల్లెల గుడిలో విరహంతో సఖి రగలాలా
సఖి నెరి చూపుల చల్లదనంతో జగములె ఊటి శాయగా
యవ్వనాల పువ్వులన్నీ నవ్వుకున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామ
ప్రేమయాత్రలకుబృందావనము నందనవనము ఏలనో
కన్న ప్రేమ లేని లేత కన్నె గువ్వకి నీకున్న ప్రేమ దోచిపెట్టవా
కన్నవారినే మరువజేయుచు అన్ని ముచ్చటలు తీర్చనా

ఊసుల బడిలో ఊహల చెలికే ఊపిరులే నీ ఆదరనే
సతి ఆదరనే పతికి మోక్షమని సర్వ శాస్త్రములు చాటగా