Skip to content

Chalti Ka Naam

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ఛాంగురే ఛాంగు ఛాంగురే ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా మజ్జారే మగరేడా మత్తైన వగకాడా హయ్యారే హయ్యారే నీకే మనసియ్యాలని ఉందిరా ఛాంగురే ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా ముచ్చటైన మొలక మీసముంది భళా అచ్చమైన సింగపు నడుముంది ముచ్చటైన మొలక మీసముంది భళా అచ్చమైన సింగపు నడుముంది జిగీబిగీ మేనుంది సొగసులొలుకు మోముంది మేటి దొరవు అమ్మకచెల్లా నీ సాటి ఎవ్వరుండుట కల్ల ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా కైపున్న మత్స్య కంటిచూపు అది చూపు కాదు పచ్చల పిడిబాకు కైపున్న మత్స్య కంటిచూపు అది చూపు కాదు పచ్చల పిడిబాకు పచ్చల పిడిబాకో విచ్చిన పువురేకో గుచ్చుకుంటే తెలుస్తుందిరా మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా గుబులుకొనే కోడెవయసు లెస్స దాని గుబాళింపు ఇంక హైలెస్సా గుబులుకొనే కోడెవయసు లెస్స దాని గుబాళింపు ఇంక హైలెస్సా పడుచుదనపు గిలిగింత గడుసు గడుసు పులకింత ఉండనీయదేమి సేతురా కైదండలిక నిలువలేనురా ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా