Skip to content

Nammavemo

Mani Sharma feat. Saketh
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది అందుకే అమాంతం నా మది అక్కడే నిశ్శబ్దం అయినది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నవ్వులు వెండి బాణాలై నాటుకు పోతుంటే చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూపం ఈడు భారాలై ముందర నించుంటే ఆ సోయగాన్నే నే చూడగానే ఓ రాయిలాగ అయ్యాను నేనే అడిగా పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా! నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది వేకువలోన ఆకాశం ఆమెను చేరింది ఓ క్షణమైనా అధరాల రంగుని ఇమ్మంది వేసవి పాపం చలివేసి ఆమెని వేడింది శ్వాసలలోన తలదాచి జాలిగ కూర్చుంది ఆ అందమంతా నా సొంతమైతే ఆనందమైన వందేళ్ళు నావే కలల తాకిడిని మనసు తాళదిక వెతికి చూడు చెలిని నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది