Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Vidhi Cheyu Vinthalanni
M. S. Viswanathan, Vanijairam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
విధి చేయు వింతలన్నీ మతి లేని చేతలేనని
విరహాన వేగిపోయి విలపించే కథలు ఎన్నో
విధి చేయు వింతలన్నీ మతి లేని చేతలేనని
విరహాన వేగిపోయి విలపించే కథలు ఎన్నో
విలపించే కథలు ఎన్నో
ఎదురు చూపులు ఎదను పిండగా ఏళ్ళు గడిపెను శకుంతల
విరహభాదను మరచిపోవగా నిదుర పోయెను ఊర్మిళ
ఎదురు చూపులు ఎదను పిండగా ఏళ్ళు గడిపెను శకుంతల
విరహభాదను మరచిపోవగా నిదుర పోయెను ఊర్మిళ
అనురాగమే నిజమని మనసొకటి దాని రుజువని
తుది జయము ప్రేమదేనని బలియైనవి బ్రతుకులెన్నో
విధి చేయు వింతలన్నీ
వలచి గెలిచి కళలు పండిన జంట లేదీ ఇలలో
కులము మతము ధనము బలము గొంతు కోసేను తుదిలో
అది నేడు జరుగరాదని ఎడబాసి వేచినాము
మనగాదే యువతరాలకు కావాలి మరో చరిత్రా
కావాలి మరో చరిత్ర
విధి చేయు వింతలన్నీ మతి లేని చేతలేనని
విరహాన వేగిపోయి విలపించే కథలు ఎన్నో
విలపించే కథలు ఎన్నో