Skip to content

Endharo Cheppinna

Krishna Tejasvi and Samrat Naidu
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ఎందరో చెప్పిన మాటే కదా కళ్ళ ముందరే ఉన్న దారే కదా కొందరే ముందన్న తీరొద్దికా కష్ట పడ్డోడికే దైవం తోడుండదా మట్టి వాసన గుర్తుంచుకో నీ తండ్రి ఆశే దాగుందిగా చిక్కి చితికిన విత్తనంలో ఓ వంశ వృక్షమే దాగుందిగా తర తరాల చెమట చుక్కలు లాల పోసెను భూమికే బాధ్యతగ కొనసాగినాదో నైవేద్యమేగా స్వామికే పేగు బంధమె ఊరికున్నది తెలుసుకుంటే స్వర్గమే అడుగు పెడితే గడప నవ్వెను గర్భ గుడి స్వగ్రామమే ఎందరో చెప్పిన మాటే కదా కళ్ళ ముందరే ఉన్న దారే కదా కొందరే ముందన్న తీరొద్దికా కష్ట పడ్డోడికే దైవం తోడుండదా (తల్లా లరే తల్లలారే తల్లా లరే తల్లాల్లా తల్లలారే తల్లాల్లా నా తల్లలారే తల్లాల్లా తందన నానే తందనా తంద తందన నానే తందనా తందన నానే తందనా తర తందన నానే తందనా) వెక్కిరింతలు లెక్కచేయకు వెక్కిరింతలు లెక్కచేయకు పళ్ళున్న చెట్టుకు అలవాటేగా కలత చెందకు చందమామకే ఏటేట చవితికి నిందలేగా ఓటమన్నది గురువు కదరా ఓర్పుతో నువ్వు గెలవవా రేపుకే దిస్క్సూచి నిన్న రెక్కలే చుక్కానిరా నీరు నేల ఆకాశం నీపై చూపెను పాశం దారే తప్పిన పాదాలు గాడిన పడితె సంతోషం తర తరాల చెమట చుక్కలు లాల పోసెను భూమికే బాధ్యతగ కొనసాగినాదో నైవేద్యమేగా స్వామికే పేగు బంధమె ఊరికున్నది తెలుసుకుంటే స్వర్గమే అడుగు పెడితే గడప నవ్వెను గర్భ గుడి స్వగ్రామమే ఎందరో చెప్పిన మాటే కదా కళ్ళ ముందరే ఉన్న దారే కదా కొందరే ముందన్న తీరొద్దికా కష్ట పడ్డోడికే దైవం తోడుండదా మట్టి వాసన గుర్తుంచుకో నీ తండ్రి ఆశే దాగుందిగా చిక్కి చితికిన విత్తనంలో ఓ వంశ వృక్షమే దాగుందిగా