Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Premante Yemitante
Hariharan & Sujatha
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
ఇదివరకు తెలియంది ఈ అనుభవం
ఎద మేలుకొలిపింది ఈ పరిచయం
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
నీ కళ్ళ వాకిళ్లలో తలుపు తెరిచెను ప్రేమ, ప్రేమ
మోహాల ముంగిళ్లలో వలపు కురిసెను ప్రేమ, ప్రేమ
ఈనాడే తెలిసింది తొలిసారిగా యెంత తీయంది ప్రేమని
ఆకాశ దీపాలు ఇల చేరగా తెర తీసింది ఆమని
ఇది సంగీతమో తొలి సంకేతమో
ఇది ప్రియగీతమో మధు జలపాతమో
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
ఏనాడు ఏ దేవతో మనను కలిపిన వేళ, వేళ
ఈనాడు ఈ దేవితో మనసు తెలిపెను చాల, చాల
కాలాలు ఓకసారి ఆగాలిలే మన తొలిప్రేమ సాక్షిగా
లోకాలు మన వెంట సాగాలిలే మన ప్రేమికుల తోడుగా
ఇది ఆలాపనో మది ఆరాధనో
మన సరసాలకే తొలి సంకీర్తనో
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
ఇదివరకు తెలియంది ఈ అనుభవం
ఎద మేలుకొలిపింది ఈ పరిచయం
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే