Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Nee Choope
Anurag Kulkarni
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నీచూపే కరిగే కన్నుల్లో
నీరూపే నిండే గుండెల్లో
నీ తలపే వలపై ఎదలో మొలిచింది
నీ నవ్వే ముల్లై నన్నే తొలిచింది
తడబడిపోతున్నా ఓ చెలీ
నీచూపే కరిగే కన్నుల్లో
నీరూపే నిండే గుండెల్లో
యుగం క్షణం అనుక్షణం
జగం మనం నీ జతలో చెలియా
క్షణం యుగం అదే జగం
చెరో సగం నువులేక, సఖియా
సిరివెన్నెల ఎండాయే
నా నీడే రెండాయే
కుదురన్నది లేదాయే నిదురయినా రాదాయే
తడబడిపోతున్నా ఓ చెలి
నీచూపే కరిగే కన్నుల్లో
నీరూపే నిండే గుండెల్లో
నా పల్లవే ఓ మల్లికై నీ కళ్ళలో మెరిసిందీ, చెలియా
ఆ పల్లవే ఓ వెల్లువై నా కళ్ళలో కురిసిందీ, సఖియా
ఇదివరకు ఎరగంది ఈనాడే జరిగింది
నడి రాతిరి పగలైంది ఓ తీయని దిగులైంది
తడబడి పోతున్నా ఓ చెలి
నీచూపే కరిగే కన్నుల్లో
నీరూపే నిండే గుండెల్లో
నీ తలపే వలపై ఎదలో మొలిచింది
నీ నవ్వే ముల్లై నన్నే తొలిచింది
తడబడిపోతున్నా ఓ చెలీ