Skip to content

Manasu Parimalinchene

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ఓ ఓ ఓ ఓ మనసు పరిమళించెనే తనువు పరవశించెనే నవ వసంత గానముతో నీవు నటన సేయగనే మనసు పరిమళించెనే తనువు పరవశించెనే నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే మనసు పరిమళించెనే తనువు పరవశించెనే నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా గలగలగల సెలయేరులలో కలకలములు రేగగా మనసు పరిమళించెనే ఆహాహా తనువు పరవశించెనే ఓహోహో నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే మనసు పరిమళించెనే తనువు పరవశించెనే క్రొత్తపూల నెత్తావులతో మత్తుగాలి వీచగా ఆహా హా ఆ క్రొత్తపూల నెత్తావులతో మత్తుగాలి వీచగా బ్రమరమ్ములు గుములు గుములుగా ఝుంఝుమ్మని పాడగా మనసు పరిమళించెనే తనువు పరవశించెనే తెలిమబ్బులు కొండకొనలపై హంసలవలె ఆడగా ఆహా ఆ ఆహా ఆ తెలిమబ్బులు కొండకొనలపై హంసలవలె ఆడగా రంగరంగ వైభవములతో ప్రకృతి విందు చేయగా మనసు పరిమళించెనే తనువు పరవశించెనే నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే మనసు పరిమళించెనే తనువు పరవశించెనే