Bhoochadamma Boochadu
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
బూచాడమ్మా... బూచాడు...
బుల్లి పెట్టెలో వున్నాడు.
బూచాడమ్మా... బూచాడు...
బుల్లి పెట్టెలో వున్నాడు.
కళ్ళకెపుడు కనపడడు
కబురులెన్నో చెపుతాడు
బూచాడమ్మా... బూచాడు...
బుల్లి పెట్టెలో వున్నాడు.
కళ్ళకెపుడు కనపడడు
కబురులెన్నో చెపుతాడు
బూచాడమ్మా... బూచాడు...
బుల్లి పెట్టెలో వున్నాడు.
కుర్ కుర్ మంటూ గోలెడతాడు.
హల్లో అని మొదలెడతాడు ...
కుర్ కుర్ మంటూ గోలెడతాడు.
హల్లో అని మొదలెడతాడు ...
ఎక్కడ వున్న ఎవ్వరినైనా.
ఎక్కడ వున్న ఎవ్వరినైనా.
పలుకరించి కలుపుతాడు
బూచాడమ్మా... బూచాడు...
బుల్లి పెట్టెలో వున్నాడు.
కళ్ళకెపుడు కనపడడు
కబురులెన్నో చెపుతాడు
బూచాడమ్మా... బూచాడు...
బుల్లి పెట్టెలో వున్నాడు.
తెలుగు తమిళ హిందీ కన్నడ భాషా బేధాలెరుగని వాడు
తెలుగు తమిళ హిందీ కన్నడ భాషా బేధాలెరుగని వాడు
కులము మతము జాతేదైనా...
కులము మతము జాతేదైనా
గుండెలు గొంతులు ఒకటంటాడు
బూచాడమ్మా... బూచాడు...
బుల్లి పెట్టెలో వున్నాడు.
డిల్లీ మద్రాస్ హైద్రాబాద్ రష్యా అమెరికా లండన్ జపాన్
ఎక్కడికైనా వెళుతుంటాడు
ఎల్లలు మనసుకు లేవంటాడు.
ఎక్కడికైనా వెళుతుంటాడు
ఎల్లలు మనసుకు లేవంటాడు.
ఒకే తీగ పై నడిపిస్తాడు...
ఒకే ప్రపంచం అనిపిస్తాడు
బూచాడమ్మా... బూచాడు...
బుల్లి పెట్టెలో వున్నాడు.
కళ్ళకెపుడు కనపడడు
కబురులెన్నో చెపుతాడు
బూచాడమ్మా... బూచాడు...
బుల్లి పెట్టెలో వున్నాడు...