Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ee Raadha Chivaraku
P. Susheela
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఈ రాధ చివరకి ఏమైనా
ఆ గాధ నీదేలే
ఈ రాధ చివరకి ఏమైనా
ఆ గాధ నీదేలే
కలలన్నీ అలలైనా యమునా నదిలో
కలతల కన్నీరే
ఈ రాధ చివరకి ఏమైనా
ఆ గాధ నీదేలే
బృందావనిలో బిగి కౌగిలిలో
అల్లికలే మాయే కలయికలే మాయే
వ్రేపల్లియలో వేణువు యదలో
గీతికలే మాయే
మధురాపురిలో నడి రాతిరిలో
మాధవుడే మాయే
ఈ రాధ చివరకి ఏమైనా
ఆ గాధ నీదేలే
మరుమల్లెలలో విరి జల్లులలో
మల్లికలే మాయే మధురిమలే మాయే
ఆ కన్నులలో
వెన్నెల దాచిన పున్నమలే మాయే
చేసిన బాసలు పూచిన ఆశలు
రాలిన పూలాయే
ఈ రాధ చివరకి ఏమైనా
ఆ గాధ నీదేలే